ETV Bharat / crime

నాగార్జునసాగర్​లో కరోనా పంజా.. వైరస్ సోకి ఇద్దరు మృతి - corona deaths in nagarjuna sagar

రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో వైరస్ బారిన పడి ఒకే కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

nagarjuna sagar, nagarjuna sagar corona cases, nagarjuna sagar corona deaths
నాగార్జునసాగర్, సాగర్​లో కరోనాతో ఇద్దరు బలి, నాగార్జువనసాగర్ కరోనా కేసులు
author img

By

Published : Apr 22, 2021, 8:08 AM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. హిల్​కాలనీకి చెందిన సుహాసిని రెండ్రోజులుగా కరోనా వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ లెవెల్ పడిపోవడం వల్ల బుధవారం హైదరాబాద్​కు తరలించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం సుహాసిని మృతి చెందారు.

అదే కాలనీకి చెందిన పాస్తం శ్రీను అనే మరో వ్యక్తి ఈనెల 19న కొవిడ్ బారిన పడ్డారు. మూడ్రోజులుగా హోం ఐసోలేషన్​లో ఉన్న శ్రీను బుధవారం రాత్రి ఇంట్లోనే మృతి చెందాడు.

సాగర్ ఉపఎన్నిక వల్ల విజృంభించిన మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని పోలీసులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే వైరస్ బారిన పడకుండా ఉంటారని, భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.