ETV Bharat / crime

నిన్న వాగులో ముగ్గురు గల్లంతు.. నేడు మృతదేహాలు లభ్యం.. - తాజా నేర వార్తలు

Three dead bodies founded in the river: వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊకచెట్టు వాగులో నిన్న సాయంత్రం గల్లంతైన తల్లి, కుమార్తె, కుమారుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన సంతోషమ్మ, ఆమె కుమార్తె పరిమళ, సోదరుడి కుమారుడు సాయికుమార్​తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వరదనీటిలో కొట్టుకుపోయారు.

Two dead bodies
వాగులో పడి తల్లి కుమార్తె మృతి
author img

By

Published : Oct 9, 2022, 3:40 PM IST

Updated : Oct 9, 2022, 7:34 PM IST

Three dead bodies founded in the river: వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊకచెట్టువాగులో శనివారం సాయంత్రం గల్లంతైన ముగ్గురి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. కొత్తకోట నుంచి ఆత్మకూరు వెళ్లే దారిలో ఊకచెట్టువాగు ఉధృతిలో లోలెవల్ వంతెన దాటేందుకు ప్రయత్నించే క్రమంలో అదుపుతప్పి బైక్ తో సహా ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. జాలర్లు సహా NDRF బృందాలు ముమ్మర గాలింపు చేపట్టి ప్రమాదస్థలికి కిలోమీటరు దూరంలో సంతోష, ఆమె కూతురు పరిమళ మృతదేహాలు మధ్యాహ్నం దొరకగా...సాయంత్రానికి సాయి కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్​తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్హులైన వారికి దళిత బందుతో పాటు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంతంగా ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. గత నెల 6న గల్లంతై మృతి చెందిన కురుమూర్తి కుటుంబానికి కూడా రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈఎన్​సీతో మాట్లాడి త్వరలోనే వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భాజపా, కాంగ్రెస్, సీపీఎం, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంతెన నిర్మించాలని మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడతామని, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ప్రమాదం ఎలా జరిగింది.. వాగుపై నిర్మించిన లో లెవల్‌ వంతెనపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వీరు వస్తున్న బైక్​ అదుపుతప్పి బైకుతో సహా వాగులో పడిపోయారు. ప్రవాహ ఉద్ధృతికి ముగ్గురూ కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు అక్కడే ఉన్న ముగ్గురు యువకులు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మదనాపురం నుంచి ఆత్మకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2022, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.