ETV Bharat / crime

SUICIDE: పిల్లలకు పురుగుల మందు తాగించి.. తండ్రి ఆత్మహత్య - తూర్పుగోదావరిలో కుటుంబం ఆత్మహత్య

ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, ఆపై తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండిలో జరిగింది. కుటుంబ కలహాలే వారి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

father suicide with two children
ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య
author img

By

Published : Jun 4, 2021, 6:18 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి గ్రామంలో దారుణం జరిగింది. గోదావరి ఒడ్డున.. ఇద్దరు చిన్నారులతో సహా పురుగుల మందు తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు వారు గుర్తించారు.

మృతులు పి. గన్నవరం మండలం కందాలపాలెం గ్రామానికి చెందిన సవరపు విశ్వనాధం (33) తన ఇద్దరు పిల్లలు రేవంత్ (9), జెస్సికా (8)లుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే.. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Corona Effect: కరోనా వచ్చిందని బాత్రూంలో క్వారంటైన్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.