ETV Bharat / crime

విద్యుదాఘాతంతో మూడు కాడెడ్లు మృతి - three bulls died news

మహబూబాబాద్​ జిల్లా జయపురంలో విద్యుదాఘాతంతో మూడు కాడెడ్లు మృత్యువాతపడ్డాయి. ఇంతకాలం కాపాడుకున్న ఎద్దులు చనిపోవడంతో బాధిత రైతు కుటుంబం బోరున విలపించింది.

విద్యుదాఘాతంతో మూడు కాడెడ్లు మృతి
విద్యుదాఘాతంతో మూడు కాడెడ్లు మృతి
author img

By

Published : Jun 17, 2021, 10:42 PM IST

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జయపురంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మందుల రామచంద్రు అనే రైతుకు చెందిన కాడెడ్లు మృతి చెందాయి. ఎద్దులపై పడి బాధిత కుటుంబసభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

రామచంద్రుకు చెందిన మూడు కాడెడ్లు మేత కోసం వ్యవసాయ భూముల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గడ్డి మేస్తున్న క్రమంలో కాడెడ్లు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఫలితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే కాడెడ్లు మృతి చెందాయంటూ రైతులు ఆందోళనకు దిగారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: Murder update: తల్లీకూతుళ్ల మృతదేహాలు పోస్టుమార్టానికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.