తమ కుమారుడిని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు ఫోన్ వచ్చినట్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయమై ఎమ్మెల్యే మొహియుద్దీన్ బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.