జగిత్యాల పట్టణం విద్యానగర్‌లోని రామాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గుడిలోకి చొరబడి.. సీతమ్మ వారిపై ఉన్న 22 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండిని దోచుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆసుపత్రిలో చేరానంటూ వల.. రూ.1.1 లక్షల టోకరా