ETV Bharat / crime

తెల్లారితే నిశ్చితార్థం... ఇంతలోనే ఊహించని ఘటన..! - నగలు ఎత్తుకెళ్లిన దొంగలు

Theft in Marriage House: తెల్లారితే నిశ్చితార్థం... బంధుమిత్రులు, కుటుంబ సభ్యులందరూ ముందురోజు పనుల్లో తలోచేయి వేసి పాలు పంచుకున్నారు. బంధువులతో నిండిపోయిన ఇల్లంతా సందడిగా మారింది. పనులన్నీ ముగించుకుని తెల్లారి తొందరగా లేవాలని అందరూ నిద్రకు ఉపక్రమించారు. అసలే పెళ్లి ఇల్లు కదా... బంధువులతో నిండిపోయి ఎక్కడివాళ్లు అక్కడ పడుకున్నారు. రాత్రి ఇంటికి గడియ వేయకుండా నిద్రించారు. అదే వారి కొంపముంచింది.

Theft in Marriage House
Theft in Marriage House
author img

By

Published : Apr 28, 2022, 5:03 PM IST

Theft in Marriage House: తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో జరిగిన పరిణామాలు వారిని షాక్​కు గురిచేశాయి. అనుకోని అతిథి ఇచ్చిన సర్​ప్రైజ్​కి వారంతా లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన బాషబోయిన ఐలయ్య గురువారం కూతురు నిశ్చితార్థం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. పనులన్నీ ముగించుకుని ఎక్కడివారు అక్కడ నిద్రకు ఉపక్రమించారు. అసలే పెళ్లి ఇల్లు కదా.. అని రాత్రి గడియ వేయకుండా ఆరు బయట కొందరు, ఇంట్లో మరికొందరు పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం దోచుకెళ్లారు.

Theft in Marriage House
దొంగలు ఎత్తుకెళ్లిన నగల సూట్​కేసు

ఐలయ్య కూతురుకు సూర్యాపేటకు చెందిన దగ్గరి యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం జరగాల్సిన నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలోనే రాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి తాంబూలాలకి సిద్ధంగా ఇంట్లో ఉంచిన రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారు నగలు ఉంచిన సూట్ కేసును ఎత్తుకెళ్లారు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో దర్యాప్తు చేపట్టారు. చోరీపై మాట్లాడేందుకు బాధితులు నిరాకరించారు. క్లూస్ టీం దర్యాప్తు అనంతరం వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:కుమార్తె జన్మదిన వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంపతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.