ETV Bharat / crime

ఆలయాల్లో హుండీలు పగులగొట్టి సొత్తు చోరీ - latest news in Martur

ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి సొమ్మును దోచుకెళ్లాడు ఓ దొంగ. భక్తులు వెళ్లిన కొద్దిసేపటికీ అతను ఈ చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆలయాల్లో హుండీలు పగులగొట్టి సొత్తు చోరీ
ఆలయాల్లో హుండీలు పగులగొట్టి సొత్తు చోరీ
author img

By

Published : Mar 12, 2021, 7:08 PM IST

ఏపీ ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెలో ఆలయాల్లో చోరీ జరిగింది. గ్రామంలోని శివాలయం, పోలేరమ్మ దేవాలయాల్లో ఒకేసారి దొంగతనం జరిగింది. తెల్లవారుజాము వరకు ఆలయంలో భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు, భజనలు చేశారు. అనంతరం గుడి తలుపులు మూసివేసి వెళ్లిపోయారు.

ఆ సమయంలో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అదే సమయంలో స్థానికంగా ఉండే పోలేరమ్మ దేవాలయంలో కూడా దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు. అందులోని కానుకలను తీసుకెళ్లి.. హుండీని సమీపంలోని పొలాల్లో వదిలేశారు. సమాచారం అందుకున్న మార్టూరు ఎస్ఐ చౌడయ్య ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

గత ఏడాది కూడా రెండు దేవాలయాల్లో ఇదే తరహాలో చోరీలు జరిగాయని గ్రామస్థులు తెలిపారు. పోలీసుల సూచన మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఆలయాల్లో హుండీలు పగులగొట్టి సొత్తు చోరీ

ఇదీ చదవండి: ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా?: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.