ETV Bharat / crime

ప్రేయసి మరణం, యువకుడి బలవన్మరణం - the young man suicide Unable to bear the death of his girlfriend

ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదురించి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. యువతి తల్లిదండ్రులు విడదీయడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువతి మరణాన్ని భరించని ఆ యువకుడు.. తానులేని ఈ లోకంలో నేనుండనంటూ ప్రాణాలు విడిచాడు. చావైనా బతుకైనా తనతోనే అంటూ.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలచివేసింది.

ప్రేయసి మరణం, యువకుడి బలవన్మరణం
ప్రేయసి మరణం, యువకుడి బలవన్మరణం
author img

By

Published : Aug 18, 2022, 8:28 AM IST

ప్రేయసి మరణం, యువకుడి బలవన్మరణం

కర్ణాటకకు చెందిన వెంకటేశ్, మంగ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నారు. శ్రీకాంత్‌ హైదరాబాద్‌ వినాయకనగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి కొంతకాలం క్రితం రాజేంద్రనగర్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. యువతి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో జూన్ 4న నగరంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. వినాయకనగర్‌లోనే ఇద్దరూ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు.. తమ కుమార్తెకు వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. శ్రీకాంత్‌ను మైనర్‌గా నిర్ధారించి.. జులై 28న యువతిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను విడదీశారనే మనోవేదనతో యువతి ఆత్మహత్య చేసుకుందని.. ఆగస్టు 15న శ్రీకాంత్‌కు తెలిసింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న శ్రీకాంత్‌.. ప్రేయసి లేకుండా తాను బతకలేనంటూ స్నేహితుల వద్ద కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అల్పాహారం చేసేందుకు బయటకి వెళ్లిన శ్రీకాంత్‌.. 10 గంటల సమయంలో వివేకానగర్‌ సమీపంలోని తోపుడు బండి వద్ద టిఫిన్ చేస్తున్నాడు. అదే సమయంలో మౌలాలి నుంచి గూడ్స్ రైలు రావడం గమనించిన శ్రీకాంత్‌.. తినే ప్లేటు అక్కడే వదిలేసి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవీ చూడండి..

మరణంలోనూ వీడని బంధం, భర్త మరణ వార్త విని భార్య మృతి

మహిళ అలాంటి దుస్తులు ధరిస్తే లైంగిక వేధింపుల సెక్షన్ వర్తించదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.