ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ గ్రామశివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బోర్గం గ్రామానికి చెందిన రాజేశ్, విక్రమ్(25) అనే ఇద్దరు పనికోసం కమ్మర్పల్లి వెళ్లి వస్తుండగా నిన్న రాత్రి బైక్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న విక్రమ్ ఎగిరి బండపై పడడంతో తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే తనువు చాలించాడు. మృతుని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ రూరల్ ఎస్సై మధుసూదన్ గౌడ్ తెలిపారు.