ETV Bharat / crime

Killer Wife: లవర్​తో కలిసి భర్తను లేపేసింది..

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే హతమార్చింది ఓ మహిళ. భర్త స్నేహితునితోనే కలిసి కుట్రపన్ని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రికరించే ప్రయత్నం చేసింది. గత నెల 31న మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ అనుమాదాస్పద మృతిని పోలీసులు ఛేదించారు.

The wife who killed her husband that was interfering with the extramarital affair

author img

By

Published : Jun 9, 2021, 10:13 AM IST

కడదాకా కలిసుండాల్సిన భార్యే.. భర్త స్నేహితుడితో కలిసి దారుణానికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తినే హతమార్చింది. గత నెల 31న మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధిలోని గద్దెరాగడిలో జరిగిన పల్లికొండ సంతోష్ అనే కూరగాయల వ్యాపారి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు.

మందమర్రి సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన సంతోష్ అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోష్ స్నేహితుడైన గుర్రం లక్ష్మణ్ తరచూ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో సంతోష్ భార్యతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సంతోష్ అడ్డు తొలగించుకోవడానికి లక్ష్మి, లక్ష్మణ్​తో కలిసి హత్యకు కుట్ర పన్నింది.

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం..

పథకం ప్రకారమే గత నెల 31న లక్ష్మణ్ సంతోష్​తో కలిసి మద్యం సేవించాడు. సాయంత్రం లక్ష్మితో కలిసి సంతోష్​ని హతమార్చారు. ఒకరు చున్నీతో పట్టుకొగా.. మరొకరు ఇనుప తీగతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.

సంతోష్ కుటుంబ సభ్యులకు లక్ష్మీపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని అరెస్టు చేసి అసలు విషయం రాబట్టారు. హత్యతో సంబంధం ఉన్న శ్రీనివాస్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చుడండి : Covid-19: వరుసగా రెండో రోజు లక్షలోపే కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.