ETV Bharat / crime

MURDER CASE: పైసలపై ప్రేమ.. ప్రియుడి మోజులో పడి 'తల్లి'నే చంపేసింది! - telangana latest news

ప్రియుడి మోజులో పడిన దత్త పుత్రిక ఘోరం చేసింది. ఆశ్రయమిచ్చిన ఆదర్శమూర్తినే అమానుషంగా హత్య చేసింది. పెంచి పెద్ద చేసిన తల్లి అనే కనికరం లేకుండా ప్రాణాలు తీసింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఊరిబయట రోడ్డు పక్కన పడేసింది. ఈ విషాదకర ఘటన కిస్మత్‌పూర్‌లో చోటుచేసుకుంది.

the-police-cracked-the-mary-murder-case
the-police-cracked-the-mary-murder-case
author img

By

Published : Sep 11, 2021, 9:23 PM IST

హత్య వివరాలు వెల్లడిస్తున్న శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​రెడ్డి

హైదరాబాద్‌ నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలో పెంపుడు తల్లి హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​రెడ్డి వెల్లడించారు. ప్రేమ పెళ్లిని అంగీకరించకపోవడంతో పాటు బ్యూటీ పార్లర్‌ నిర్వహణకు డబ్బులు ఇవ్వకపోవడంతోనే ప్రియుడు, మరొకరితో కలిసి మేరీ క్రిస్టియన్​ను పెంపుడు కుమార్తె రోమా ప్రణాళిక ప్రకారం హత్య చేసిందని వివరించారు.

'మృతురాలు మేరీ క్రిస్టియన్‌ నగరంలో మారిక అనే స్కూల్‌ నిర్వహిస్తున్నారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరికి ఇప్పటికే పెళ్లిళ్లు జరిగాయి. అయితే ఆదర్శ భావాలు కలిగిన మేరీ మరో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని పోషిస్తోంది. వీరిలో రోమా అనే యువతి మూడు నెలల క్రితం తాను విక్రమ్‌ శ్రీరాములు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేయాలని మేరీని కోరింది. ఇందుకు మేరీ అంగీకరించకపోవడంతో ఆమెతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయింది. మళ్లీ ఇటీవల మేరీ వద్దకు వచ్చి.. తాను బ్యూటీపార్లర్ ఏర్పాటు చేసుకుంటానని.. అందుకోసం డబ్బులు ఇవ్వాలని కోరింది. అందుకూ మేరీ ఒప్పుకోకపోవడంతో మేరీని చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఈ నెల 9న మేరీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. రోమా తన ప్రియుడు విక్రమ్‌ శ్రీరాములు కలిసి ఆమెకు ఉరివేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని హిమాయత్​సాగర్ చెరువు పక్కన ఉన్న పొదల్లో పడేశారు' అని డీసీపీ వివరించారు.

వీరికి రాహుల్‌ గౌతమ్ అనే వ్యక్తి సహకరించాడని డీసీపీ తెలిపారు. మృతురాలి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్న ఆయన.. పెంపుడు కూతురు రోమాపై అనుమానంతో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని నిందితురాలు చూపించగా.. స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిస్మత్‌పురాకు చెందిన మేరీ క్రిస్టియన్ అనే మహిళ మారిక స్కూల్‌ ప్రిన్సిపల్‌గా పని చేసేవారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఆదర్శభావాలు కలిగిన మేరీ క్రిస్టియన్.. ఓ ఆశ్రమం నుంచి రూమాతో పాటు మరో యువతిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. రూమా ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. ప్రియుడితో కలిసి పెంపుడు తల్లి మేరీ క్రిస్టియన్‌ను మూడు రోజుల క్రితం మెడకు కొబ్బరితాడుతో ఉరివేసి చంపేసింది.

అనంతరం ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో తల్లి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి హిమాయత్‌సాగర్‌ చెరువు సమీపంలోని రహదారి పక్కన పడేసి వెళ్లిపోయింది. మూడు రోజులుగా మేరీ క్రిస్టియన్ కనిపించకపోవడంతో ఆమె సొంత కుమార్తె భర్త.. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దత్త పుత్రిక రూమాను విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది.

సంబంధిత కథనం..

Daughter Killed Mother: తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.