జగన్ అక్రమాస్తుల వ్యవహారం(Jagan Disproportionate Assets Case)లో భాగంగా జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులకు సంబంధించి నమోదు చేసిన కేసులో దర్యాప్తు పూర్తయిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సీబీఐ(ఈడీ) కోర్టులో మెమో దాఖలు చేసింది. ఈడీ కేసులో నిందితులైన ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు హాజరు మినహాయింపు కోరగా, జగతి పబ్లికేషన్స్ తరఫున ఎస్.బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై వాదనలు వినిపించడానికి చివరి అవకాశంగా అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది.
సీబీఐ నమోదు చేసిన పెన్నా కేసులో జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ డిశ్ఛార్జి పిటిషన్‌లపై కౌంటరు దాఖలు చేయడానికి సీబీఐ గడువు కోరడంతో విచారణను అక్టోబరు 5వ తేదీకి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసును అక్టోబరు 1వ తేదీకి, భారతి సిమెంట్స్ కేసులో నిందితుల డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్ వ్యవహారంపై సీబీఐ కేసు 4వ తేదీకి, ఈడీ కేసు 12కు వాయిదా వేస్తూ దర్యాప్తు స్థాయిని చెప్పాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.