ETV Bharat / crime

కర్ణాటక బస్సు ప్రమాద ఘటన.. మృతదేహాలు బంధువులకు అప్పగింత - Karnataka bus accident latest update

కర్ణాటక బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రి నుంచి బొల్లారం రిసాలాబజార్​కు తరలించి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

కర్ణాటక బస్సు ప్రమాద ఘటన.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

author img

By

Published : Jun 5, 2022, 9:57 AM IST

Karnataka bus Accident: కర్ణాటక ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన అర్జున్, సరళ, విహాన్, అనితల మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రి నుంచి బొల్లారం రీసాలాబజార్ బంజారా విలేజ్ కాలనీలోని వారి నివాసాలకు తరలించారు. తెల్లవారుజామునే మృతదేహాలను తరలించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు.

ఒకేసారి రెండు కుటుంబాలకు చెందిన వారు మృతి చెందడంతో బంజారా విలేజ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కాలనీవాసుల రోదనలు మిన్నంటాయి. విహార యాత్ర కోసమని వెళ్లిన వారు.. విగత జీవులై తిరిగి రావడంతో అందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

ఇదీ జరిగింది..

డ్రైవర్‌ సహా 35 మందితో కూడిన ఓ ప్రైవేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ ఉన్నారు. తెల్లవారుజామున కర్ణాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్‌ బస్సు బీదర్‌-శ్రీరంగపట్టణం హైవే గుండా గమ్యం వైపు సాగుతున్న క్రమంలో.. కమలాపుర వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు వేగంగా బస్సు అంతటికి వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులో ఉన్న పలువురిని రక్షించారు. బస్సు అద్దాలు పగులకొట్టి వారిని కాపాడారు. అయితే ఈ లోపే మంటలు విస్తరించడం వల్ల బస్సులోని.. ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు వైద్యం కోసం క్షతగాత్రులను కలబురిగి జిల్లా ఆసుపత్రితో పాటు యునైటెడ్, గంగా ఆసుపత్రులకు తరలించారు. మంటల్లో తీవ్రగాయాలపాలైన మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మినీ లారీ డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బీవన్‌, దీక్షిత్‌ అనే ఇద్దరితో పాటు రవళి, సరళాదేవి, అర్జున్‌ శివకుమార్‌, అనితారాజు, శివకుమార్​ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి..

'పొద్దున వరకు వచ్చేస్తామని చెప్పారు..' బస్సు ప్రమాదంపై బంధువుల భావోద్వేగం

'అందరం బంధువులమే.. ఎవరు బతికున్నారో తెలియడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.