భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జనగామ జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. తెరాస, భాజపా శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో దేవరుప్పులలో మాట్లాడిన బండి సంజయ్ తెరాస హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని.... ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని విస్మరించారని మండిపడ్డారు. ఈ క్రమంలో... బండి సంజయ్ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాస ఎన్నికల ప్రణాళికలోని ఎన్ని హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పలువురు భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
-
Even as we are peacefully marching, TRS is creating unrest.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Police behaved like TRS Karyakartas.
Spoke to DGP garu and sought immediate action on the incident.
Telangana will definitely react to this incident pic.twitter.com/Czl1hIGHZq
">Even as we are peacefully marching, TRS is creating unrest.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 15, 2022
Police behaved like TRS Karyakartas.
Spoke to DGP garu and sought immediate action on the incident.
Telangana will definitely react to this incident pic.twitter.com/Czl1hIGHZqEven as we are peacefully marching, TRS is creating unrest.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 15, 2022
Police behaved like TRS Karyakartas.
Spoke to DGP garu and sought immediate action on the incident.
Telangana will definitely react to this incident pic.twitter.com/Czl1hIGHZq
పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. డీజీపీ గారు ప్రజా సంగ్రామ యాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడండి. స్పందించకపోతే జరిగే పరిణామాలకు పోలీసులదే బాధ్యత. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
వరంగల్ పోలీస్ కమిషనర్ తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన బండి సంజయ్.... ప్రజా సంగ్రామ యాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని కోరారు. స్పందించకపోతే జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెదిగే సమయం ఆసన్నమైందని... అందుకే ఇలా దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యం వల్లే... భాజపా శ్రేణులపై దాడి జరిగిందని ఆ పార్టీ నేతలు రాణి రుద్రమ, సంగప్ప, రచనారెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి: