ETV Bharat / crime

Cyber crimes today: సైబర్​ నేరగాళ్ల నయా చీటింగ్​.. వాట్సాప్​లో మిత్రుల ఫొటోలతో.. - cyber cheaters chatting on WhatsApp with photos of friends

Cyber crimes today: అమాయకులే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజుకో కొత్త పంథా అనుసరిస్తూ.. అవతలి వ్యక్తికి అనుమానం రాకుండా వారి ఖాతాలను కొల్లగొడుతున్నారు. లోన్లు, గిఫ్టులు, ఆఫర్ల పేరిట వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా విదేశాల్లో ఉన్న వ్యక్తుల ఫొటోలను ఉపయోగించుకుంటూ.. ఇక్కడ వారి మిత్రులకు డబ్బు అవసరమంటూ సందేశాలు పంపిస్తున్నారు. దీంతో నిజమేనని నమ్మిన బాధితులు.. వారి ఖాతాలోకి డబ్బు పంపించి.. చివరికి మోసపోయామని గ్రహిస్తున్నారు. తాజాగా వీరి మోసానికి ఐదుగురు యువకులు బలయ్యారు.

cyber cheaters chatting on WhatsApp
వాట్సాప్​ ద్వారా సైబర్​ మోసాలు
author img

By

Published : Dec 6, 2021, 9:36 AM IST

Cyber crimes today: 'హాయ్‌ ఎలా ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. రూ.5000 నా ఫ్రెండ్‌ నెంబర్‌కు గూగుల్‌ పే గానీ, ఫోన్‌పే కానీ చేయవా.. తనకు అత్యవసరం ఉంది.. అంటూ మిత్రుల ఫొటోలతో వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేస్తూ నగదు కాజేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. మొన్నటి వరకు బ్యాంకు అధికారులమని మాట్లాడి ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌)తో నగదు కాజేసిన దుండుగులు ఇప్పుడు ఈ తరహా మోసాలకు తెరతీశారు. మెదక్​ జిల్లా తూప్రాన్‌లో శనివారం రాత్రి గంటల వ్యవధిలోనే 5 మంది నుంచి సుమారు రూ.30 వేల వరకు కాజేయడం గమనార్హం.

Cyber crimes today
సైబర్​ నేరగాళ్ల నయా చీటింగ్​

Cyber cheaters whats app chatting: సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు అతడి చిత్రాన్ని వాట్సాప్‌ నెంబరుకు పెట్టి తూప్రాన్‌, వర్గల్‌ మండలాల్లో ఉన్న అతడి మిత్రులకు నగదు కోసం వల వేశాడు. అమెరికాలో ఉన్న సదరు యువకుడి మాదిరిగానే హాయ్‌ అని సందేశం పంపించారు. నా సోదరుడికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది.. ఒక 5కే (రూ.5000) పంపించు అంటూ ఓ ఫోన్‌ నెంబరుపై సందేశంలో పంపించాడు. నిజంగానే తన మిత్రుడే అనుకొని పలువురు రూ.4, రూ.5 వేల చొప్పున సైబర్‌ నేరగాడు ఇచ్చిన ఫోన్‌నెంబరుకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించారు. డబ్బు బదిలీ అయిందా తెలుసుకుందామని ఫోన్​ చేసేసరికి.. సైబర్‌ నేరగాడు నెంబరును స్విచ్చాఫ్‌ చేశాడు.

Cyber crime through whatsapp : దీంతో ఇక్కడి వారు అమెరికాలో ఉన్న స్నేహితుడిని ఆరా తీయగా నేనేం నగదు అడగలేదని చెప్పడంతో మోసపోయామని గ్రహించడం యువకుల వంతయింది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న మిత్రుల ఫొటోలను తీసుకొని సైబర్‌ నేరగాళ్లు.. యువకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి సందేశాలు వస్తే ముందుగా ఆరా తీయాలని పోలీసులు సూచిస్తున్నారు. మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఇలాంటి నేరాలు గ్రామీణ ప్రాంతాలకు పాకడం గమనార్హం.

ఇదీ చదవండి: Cyber Crime Today : సైబర్​ కేటుగాళ్ల నయా పంథా.. అద్దె ఇళ్ల నుంచే మోసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.