ETV Bharat / crime

ఇంటి వద్ద దిగబెడతానని కారులో ఎక్కించి.. టీచర్‌పై అత్యాచారం

author img

By

Published : Mar 24, 2022, 7:27 AM IST

Updated : Mar 24, 2022, 7:41 AM IST

Teacher Rape in Khammam : మిట్టమధ్యాహ్నం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లడానికి ఓ ఉపాధ్యాయురాలు రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తోంది. ఇదే అదనుగా తీసుకున్న అదే బడిలో పని చేసే మరో ఉపాధ్యాయుడు.. తనను ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించాడు. తనతో కలిసి పనిచేసే వాడే కదా అని నమ్మి ఆమె అతని కారు ఎక్కింది. ఆ మహిళ కారు ఎక్కగానే.. ఆ మగాడిలో మృగం నిద్రలేచింది. ఆమెను ఇంటి వైపు కాకుండా ఎక్కడికో తీసుకెళ్లడం గుర్తించిన మహిళ అతణ్ని నిలదీసింది. అరిస్తే చంపుతా అంటూ బెదిరించి ఆమె వద్ద మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. ఆమెను ఓ ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

Teacher Rape in Khammam
Teacher Rape in Khammam

Teacher Rape in Khammam : చంపుతానంటూ బెదిరించి తోటి ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి పాల్పడిన కీచక ఉపాధ్యాయునిపై ఖమ్మం ఖానాపురంహవేలి పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం పాఠశాలలో బాణోతు కిశోర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలే. ఖమ్మంలో నివసించే వారు ఇద్దరూ కారులో పాఠశాలకు వెళ్లివస్తుంటారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివసించే ఓ ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ వరకు ప్యాసింజర్‌ రైలులో, అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వస్తున్నారు.

ఈనెల 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహిస్తున్నారు. 17న ఇంటికి తిరిగి వచ్చేందుకు రైల్వేస్టేషనులో వేచి ఉన్న సదరు మహిళా ఉపాధ్యాయురాలిని తన భార్య కూడా వస్తోందని నమ్మించి కారు ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను చంపుతానని బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. మార్గమధ్యలో పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమె భర్తను, పిల్లలను చంపుతానని బెదిరించాడు. దీంతో విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే తీవ్రంగా మధనపడిన ఆమె మంగళవారం తన భర్తకు విషయం తెలిపారు. భర్తతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కిశోర్‌ పరారీలో ఉన్నాడని సీఐ వివరించారు.

Last Updated : Mar 24, 2022, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.