ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు కీలక నేత సురేశ్ సూరన (Maoist Key Leader Suresh Surana) పోలీసులకు చిక్కకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. ఒడిశాలోని బాదిలీ హిల్స్ ప్రాంతంలో మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం అక్కడికి వెళ్లారు. వారిని చూసిన వెంటనే మావోయిస్టులు కాల్పులు జరిపారని మల్కాన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్ మీనా (Malkangiri SP Prahlad Meena) గురువారం వెల్లడించారు.
అనంతరం పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారని తెలిపారు. ఇరువర్గాల మధ్య దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగాయని చెప్పారు. అదే సమయంలో అనువు చూసుకుని సురేశ్ సూరన తన సహచరులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : Maoist Sharadakka: మావోయిస్టు నేత శారదక్క లొంగుబాటు