ETV Bharat / crime

SUICIDE: స్మార్ట్ ఫోన్​ కొనివ్వలేదని... విద్యార్థిని ఆత్మహత్య - ఫోన్​ కొనివ్వలేదని ఆత్మహత్య

స్మార్ట్​ ఫోన్​ కొనివ్వలేదని విద్యార్థిని క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను అర్థం చేసుకోకుండా ప్రాణం తీసుకుంది. ఆన్​లైన్​ క్లాసుల కోసం ఆరాటపడి... కన్నవారికి తీరని శోకం మిగిల్చింది.

SUICIDE
విద్యార్థిని ఆత్మహత్య
author img

By

Published : Jul 28, 2021, 11:51 AM IST

తల్లిదండ్రులు ఫోన్​ కొనివ్వలేదని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్​లో చోటు చేసుకుంది. మహబూబాబాద్​లోని కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్​కు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో చిన్న కుమార్తె కూస త్రిష ఇటీవల పదో తరగతి పాస్​ అయింది.

ఆన్​లైన్​ క్లాసులు ఉన్నాయని... సెల్​ఫోన్​ కొనివ్వాలని త్రిష తండ్రిని కోరింది. ఇప్పుడు డబ్బులు లేవు... కొద్దిరోజులు ఆగుమని సంపత్​ చెప్పగా... తీవ్ర మనస్తాపానికి గురైంది. తండ్రిని అర్థం చేసుకోకుండా... క్షణికావేశంలో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నర్సంపేట ఏరియా హాస్పిటల్​కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రిష మృతి చెందింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: She Teams: మహిళలను యువకులే ఎక్కువ వేధిస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.