ETV Bharat / crime

ముంపు భూముల్లో అక్రమ బేరం.. లీజు దందా - ముంపు భూముల అన్యాక్రాంతం

ముంపు భూములు క్రమక్రమంగా అన్యాక్రాంతమవుతున్నాయి. ఎస్సారెస్పీ ముంపు ప్రాంతాల్లో లీజు పేరిట దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు ఆధిపత్యం చెలాయిస్తూ.. భూములను లీజుకు ఇస్తున్నారు. ఎకరాకు రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా వేల ఎకరాల్లో ఏటా లక్షల్లో వ్యాపారం సాగుతోంది. ఇంత జరుగుతోన్నా.. అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

srsp affected lands Gradually becoming alienated by Illegals
ముంపు భూముల్లో అక్రమ బేరం.. లీజు దందా
author img

By

Published : Feb 16, 2021, 12:14 PM IST

శ్రీరామసాగర్‌, శ్రీశైలం జలాశయాల ముంపు భూములు అక్రమాలకు ఆలవాలంగా మారాయి. ఎస్సారెస్పీలో దాదాపు 14 వేల ఎకరాలు చేతులు మారగా, శ్రీశైలంలో సుమారు 15 వేల ఎకరాల్లో లీజు దందా నడుస్తోంది. శ్రీరామసాగర్‌ భూములపై హైదరాబాద్‌కు చెందిన వారు, కొందరు అధికారులు, విశ్రాంత అధికారులు కన్నేసి పెట్టుబడులు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకపోవడంతో బాండ్‌ పేపర్లపై అగ్రిమెంట్లతో క్రయవిక్రయాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ముంపు భూముల్లో ఏటా రూ.కోట్లు చేతులు మారుతున్నాయి.

ఇదీ కారణం... శ్రీరామ!

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో విస్తరించి ఉంది. 1983లో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి (1,083 అడుగులు- ఎఫ్‌ఆర్‌ఎల్‌) అనుగుణంగా ఒకసారి, 1984-1994 మధ్య కనీస నిల్వ మట్టం స్థాయికి (1,090 అడుగులు-ఎండబ్ల్యూఎల్‌) తగ్గట్టుగా రెండోసారి మొత్తం 99 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పటి వరకు ఏనాడూ ఎండబ్ల్యూఎల్‌ హద్దు వరకు నీళ్లు చేరలేదు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు, నవీపేట, నందిపేట, బాల్కొండ నిర్మల్‌ జిల్లాలో బాసర మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న భూములను కొందరు విక్రయిస్తున్నారు. పట్టా భూమి ఎకరా రూ. 15 లక్షలకు పైగా ఉండగా ఈ భూమి రూ.3 లక్షలకు వరకు ధర పలుకుతోంది. పసుపు, సోయా వంటి పంటలు సాగవుతున్నాయి. రెండు పంటలు చేతికి వస్తుండటంతో హక్కుల మాట అటుంచి డబ్బున్నోళ్లు కొనేస్తున్నారు. గతేడాది చివర్లో అవినీతి నిరోధక శాఖకు పట్టుపడిన ఓ జిల్లా స్థాయి అధికారి భారీ విస్తీర్ణాన్ని కొన్న విషయం వెలుగుచూసింది. మరోవైపు నీటిపారుదల శాఖ ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. రెవెన్యూ, సర్వే, నీటిపారుదల శాఖ బృందాలు సర్వే చేపట్టగా కొన్ని మండలాల్లో కబ్జాదారులు అడ్డు పడుతున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 14 వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు బృందాల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ భూములు ప్రభుత్వానివని, ఆహారశుద్ధి పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వాటిని వినియోగిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. హద్దు రాళ్లకు బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపామని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని వివరించారు.

శ్రీశైలం వెనుక భూముల్లో...

శ్రీశైలం జలాశయం వెనుక ప్రాంతమైన నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ముంపు భూముల్లో లీజు పేరిట కొందరు దందా చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో పెంట్లవెళ్లి మండలం, వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి, పెబ్బేరు మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. భూ సేకరణ సమయంలో ఈ భూములు అప్పగించిన వారిలో కొందరు నీళ్లు ఖాళీ కాగానే వాటిపై ఆధిపత్యం చెలాయిస్తూ లీజుకు ఇస్తున్నారు. పెబ్బేరుకు చెందిన ఓ వ్యక్తి వందల ఎకరాలను ఆధీనంలో పెట్టుకుని సాగుచేస్తున్నాడు. స్థానికులు, దళారులు, రైతు సంఘాల వారం అని చెప్పేవారు ఈ భూముల నుంచి ఎకరాకు రూ.5 వేల వరకు లీజు పేరుతో వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జగిత్యాల మున్సిపల్​లో జోరుగా అక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.