ETV Bharat / crime

దుండగుల దాడి... కోలుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి - దుండగుల దాడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో ఏప్రిల్‌ నెల 21న ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేస్తుండగా దుండగులు దాడికి పాల్పడ్డారు.

software engineer died  attack unidentified persons a
దుండగుల దాడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి
author img

By

Published : May 3, 2021, 2:13 PM IST

ఏటీఎంకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దుండగులు దాడి చేయగా.. కోలుకోలేక ఈనెల 1న అతను మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 21న మెహదీపట్నంలోని ఐసీఐసీఐ ఏటీఎం వద్దకు వెళ్లిన రమేశ్‌ కుమార్‌పై ముగ్గురు ఆగంతుకులు దాడికి పాల్పడ్డారు.

అతని వద్ద నుంచి డబ్బులు, పర్సు, రెండు బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్ లాక్కెళ్లారని మృతుని భార్య ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మీ దగ్గర పనిచేశా.. మీ గురించి తెలియదా?: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.