కర్ణాటకలోని రాయిచూరు నుంచి నిషేధిత గుట్కాను మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి బస్సులో తరలిస్తుండగా ఆర్టీసీ అధికారులు దేవరకద్రలో పట్టుకున్నారు. రాష్ట్రంలో నిషేధం ఉన్న గుట్కాలను కర్ణాటక నుంచి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి అనుమతి లేకుండా తరలిస్తుండగా సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు తనిఖీలు జరిపారు.
హైదరాబాద్-1 డిపో చెందిన 2 ఆర్టీసీ అద్దె బస్సులు హైదరాబాద్కు బయలుదేరాయి. అనుమానం రాకుండా ఒక బస్సులో దుస్తులు పెట్టుకునే రెండు బస్తాల్లో, మరో బస్సులో కాటన్ డబ్బాలో నిషేధిత గుట్కాలు పెట్టి మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నం చేశారు. దేవరకద్ర బస్టాండ్లో బస్సులు తనిఖీ చేయగా గుట్కా పట్టుబడింది. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.