ETV Bharat / crime

750 బస్తాల రేషన్​ బియ్యం పట్టివేత

పేదలకు పంచాల్సిన రేషన్​ బియ్యం పక్కదోవ పడుతోంది. నిత్యం ఏదో చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చట్ట వ్యతిరేక చర్యలకు కఠిన శిక్షలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. మేడ్చల్​ జిల్లా షామీర్ పేట్ పరిధిలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ రేషన్​ బియ్యాన్ని జిల్లా సబ్ డివిజన్ అధికారి పట్టుకున్నారు.

seizure of pds rice
seizure of pds rice
author img

By

Published : Jun 7, 2021, 5:28 PM IST

మేడ్చల్​ జిల్లా షామీర్ పేట్ పరిధిలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 750 బస్తాల రేషన్​ బియ్యాన్ని జిల్లా సబ్ డివిజన్ అధికారి ప్రసన్న పట్టుకున్నారు. స్థానిక భాజపా నేతల సమాచారంతో దాడులు నిర్వహించి పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తహసీల్దార్​ కార్యాలయానికి సమీపంలోనే అవినీతి జరుగుతున్నా.. పట్టించుకునే అధికారులే కరువయ్యారంటూ నేతలు మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.