ETV Bharat / crime

ఫేక్ సర్టిఫెకెట్లతో ఏటా రూ.20 కోట్లు.. అదే వారి టార్గెట్‌

Fake Certificate Issue : నకిలీ ధ్రువపత్రాల కోసం వెళ్తున్న విద్యార్థుల వివరాలను ఏజెంట్ల ద్వారా సేకరిస్తారు. తమ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసినట్టు పట్టాలు ఇస్తారు. దానికోసం విద్యార్థుల నుంచి లక్షలు వసూల్ చేస్తారు. ఇలా ఏటా ఒక వేయి మందికి నకిలీ పట్టాలు ఇచ్చి కనీసం రూ.20 కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇదంతా ఏ కన్సల్టెన్సీయో లేక ఏదైనా ఫేక్ కంపెనీయో చేస్తుందనుకుంటే పొరపాటే. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయలో తవ్వేకొద్ది ఇలాంటి అక్రమాలు బయటపడుతున్నాయి. వర్సిటీ ఉపకులపతులే ఈ అక్రమానికి పాల్పడుతుండటం విస్మయానికి గురి చేస్తోంది.

Fake Certificate Issue
Fake Certificate Issue
author img

By

Published : May 21, 2022, 1:04 PM IST

Fake Certificate Issue : చదవకపోయినా రూ.లక్షలు పుచ్చుకొని ఇంజినీరింగ్‌, డిగ్రీలు పూర్తి చేశారంటూ పట్టాలు ఇస్తున్న భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయంలో అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. వర్సిటీ ఉపకులపతులు ఏటా వెయ్యిమందికి నకిలీ పట్టాలు ఇచ్చి రూ.20 కోట్లు అక్రమంగా సంపాదించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీన్ని మాజీ ఉపకులపతి కుష్వా నాలుగేళ్ల క్రితం ప్రారంభించగా ప్రస్తుత వీసీ ప్రశాంత్‌ పిళ్లై, కొనసాగిస్తున్నారు.

Fake Certificate Case : మరోవైపు ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టాలు తీసుకున్న కొందరు విద్యార్థులు అమెరికాలో ఉన్నారంటూ పోలీసులు తెలపడంతో దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌, డిగ్రీ పట్టాలు తీసుకున్న విద్యార్థుల్లో అమెరికాకు ఎంతమంది వెళ్లారు.. వారి విద్యార్హత పత్రాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్న అంశాలను నిర్ధారించుకునేందుకు విద్యార్థుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. వర్సిటీలోని అక్రమాల వివరాలను తెలుసుకునేందుకు వీసీ ప్రశాంత్‌ పిళ్లై, మాజీ వీసీ కుష్వాలను తమకు అప్పగించాలంటూ సీసీఎస్‌ పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

Bhopal University Fake Certificate Issue : ఉపకులపతుల కనుసన్నల్లోనే.. డిగ్రీకి రూ.2 లక్షలు, ఎంబీఏకు రూ.2.50 లక్షలు, ఇంజినీరింగ్‌కు రూ.4 లక్షలు వసూలు చేస్తూ నకిలీ పట్టాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, చెన్నై, దిల్లీలోని కన్సల్టెంట్ల నిర్వాహకులు 30 నుంచి 40 శాతం కమీషన్‌ తీసుకుని పట్టాలు అవసరమైన వారిని తీసుకొచ్చేవారు. ఆ తర్వాత వ్యవహారమంతా ఎస్‌ఆర్‌కే వర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్‌.ఎస్‌.కుష్వా చూసుకునేవాడు. అతడు గతేడాది పదవీవిరమణ చేశాక బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్‌ పిళై నకిలీ పట్టాలు మరింత మందికి ఇవ్వాలంటూ లక్ష్యాలను నిర్దేశించినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. గత మూడు నెలల్లో ఎస్‌ఆర్‌కే వర్సిటీ నుంచి 44 మంది అక్రమంగా పట్టాలు తీసుకున్నవారు పట్టుబడితే వారిలో 19 మంది హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో ఉన్నారని అదనపు సీపీ(నేర పరిశోధన) ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.