ETV Bharat / politics

100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా

ఏపీలో టీడీపీ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు - నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు సమీక్ష - 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా

Membership Registration In AP
AP CM Chandrababu Review Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

TDP MEMBERSHIP STARTS FROM TOMORROW : ఆంధ్రప్రదేశ్​లో టీడీపీ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. శనివారం టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది.

రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీ : ఏపీలో రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ఉదయం నుంచి చంద్రబాబు కసరత్తు చేశారు. సుమారు మూడు గంటల పాటు పదవుల పై ముఖ్యమంత్రి నాయకులతో కసరత్తు చేశారు. సాధ్యమైనంత వరకు రెండో లిస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఫేజ్​లో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో ఈ దఫా లిస్ట్ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూటమి పక్షాలతో కూడా సీఎం చంద్రబాబు సంప్రదింపులు చేస్తున్నారు. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిని వారికి తప్పకుండా పదవులుంటాయని చంద్రబాబు తెలిపారు. దీని కోసం వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.

ఏపీలో విధ్వంసం పోయి, నిర్మాణం ప్రారంభం - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు తెలపాలి : ఏపీ సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.