Youtube Shopping Affiliate Programme: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ అత్యధిక ప్రజాదరణతో దూసుకుపోతోంది. తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు చాలామంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్‌లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ తెచ్చింది.
కంటెంట్ క్రియేటర్ల వారి ఆదాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా 'యూట్యూబ్ షాఫింగ్ అఫీలియేటెడ్ ప్రోగ్రామ్' అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో క్రియేటర్స్ తమ వీడియోస్‌లో ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేసి మరింత ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం దీనికోసం మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
యాక్సెస్ చేసుకోవడం ఎలా?: ఈ కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వీడియో క్రియేటర్స్ యూట్యూబ్ షాపింగ్‌లో సైనప్ అవ్వాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్‌ను యూట్యూబ్ ఆమోదించాక ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే వీడియోలు, షార్ట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లో ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేయొచ్చు.
ఇలా ప్రమోట్ చేసిన ఉత్పత్తులను యూజర్లు కొనుగోలు చేస్తే క్రియేటర్లకు కమీషన్ అందుతుందని యూట్యూబ్ తెలిపింది. ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేసే సమయంలోనే కమీషన్ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. అంతేకాక కంటెంట్ క్రియేటర్స్ ఒక వీడియోకు దాదాపు 30 ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేయొచ్చని యూట్యూబ్ తెలిపింది.
ఈ ఫెసిలిటీ వారికి మాత్రమే: యూట్యూబ్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం అయిన కంటెట్ క్రియేటర్లకు ఈ సదుపాయం ఉంటుంది. అంటే వీరికి 10వేల మంది కంటే ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉండాలి. అయితే పిల్లల కోసం ఛానల్స్ నడుపుతున్న వాళ్లకు, మ్యూజిక్ ఛానల్స్ నడిపేవారికి ఈ ఫెసిలిటీ ఉండదని యూట్యూబ్ స్పష్టం చేసింది.
అక్కడే పూర్తి వివరాలు: కంటెంట్ క్రియేటర్స్ ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్ యూజర్లకు నచ్చితే పక్కనే ఉన్న షాపింగ్ సింబల్‌పై క్లిక్ చేస్తే వాటి వివరాలు కన్పిస్తాయి. ఇందుకోసం వేరే బ్రౌజర్ పేజ్‌కు కూడా వెళ్లాల్సిన పనిలేదు. అక్కడే ఆ ప్రొడక్ట్ పూర్తి వివరాలు ఉంటాయి. అంతేకాక నచ్చినవాటిని అక్కడే పిన్ కూడా చేసుకోవచ్చు.
కొత్త బైక్ కొంటున్నారా? టీవీఎస్ రైడర్ iGo చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
యాపిల్ కొత్త ప్రొడక్ట్స్‌పై అప్డేట్ వచ్చేసిందోచ్..!- రిలీజ్ ఎప్పుడంటే?