Police Battalion Families Protest at Secretariat : ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే జిల్లాల్లో పోలీస్ బెటాలియన్ భార్యలు ఆందోళనకు దిగారు. అనంతరం వారు సచివాలయ ముట్టడి ప్రయత్నించగా అరెస్టులకి దారితీసింది. ఏక్ పోలీస్ విధానాన్ని అమలుచేసి తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్ ఇవ్వాలని నినదించారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలి, కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు.
"ఎప్పుడు అంటే అప్పుడు పిలుస్తారు. సమయం లేకుండా వెళ్లిపోతారు. డ్యూటీ ఎంత ముఖ్యమో భార్యపిల్లలనూ కూడా అంతే చూసుకోవాలి. మా అబ్బాయికి జర్వం వచ్చినా రెండు నెలల వరకు ఇంటికి రాలేదు. ఇలాగైతే కుటుంబంతో కలిసి ఉండేది ఎప్పుడు. గడ్డి తీపిస్తారు, మట్టి, ఇటుకలు మోపిస్తారు ఇవన్నీ చేయడానికి వీళ్లు పోలీసులా లేక కూలీలా." - పోలీస్ బెటాలియన్ కుటుంబ బాధితులు
259 మందితో హైడ్రా టీమ్! - ఎవరెవరు ఉన్నారంటే? - 259 MEMBERS DEPUTATION TO HYDRA
కూలీలా లేకా పోలీసులా : బెటాలియన్ కానిస్టేబుళ్లను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి, ఇటుకలు మోపిస్తున్నారని, గడ్డి తీసే పనులు చెప్తున్నారని వాపోయారు. రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని, బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల మా కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
"ఒక్కొక్కరికి ఒక్కోలా డ్యూటీ ఎందుకు వేస్తున్నారు. చిన్నపిల్లలను తీసుకుని రోడ్డు పైకి వచ్చి వాళ్ల కోసం ఇంత చేస్తున్నాం అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కదా. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలా మాదిరిగా ఏక్ పోలీస్ విధానం చేయవచ్చు. ఒకటే ఎగ్జామ్, ఒకటే నోటిఫికేషన్ అన్నప్పుడు ఒకటే పోలీస్ ఎందుకు కాదు." - పోలీస్ బెటాలియన్ కుటుంబ బాధితులు
సెలవుల రద్దు వాయిదా : బెటాలియన్ కానిస్టెబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని పోలీస్ శాఖ తాత్కలికంగా వాయిదా వేసింది. వారి కుటుంబ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సెలవుల రద్దు నిర్ణయం వాయిదా వేశారు. అలాగే బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని నిర్ణయించింది.