ETV Bharat / crime

ఏపీలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్​ - గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లో రికవరీ వ్యానులో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేశారు.

rs-2-crore-worth-of-ganja-seized-at-vizayanagaram
ఏపీలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్​
author img

By

Published : Mar 21, 2021, 9:29 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యం నుంచి బిహార్​కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్​ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఏవోబీలోని గోచెక్క గ్రామ సమీపంలో రికవరీ వ్యాన్​ను పోలీసులు తనిఖీ చేశారు. వ్యాను వెనుక భాగంగా రహస్య అరలను ఏర్పాటు చేసి బిహార్​కు తరలిస్తున్న 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మత్తు పదాపదార్థాల విలువ సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని సీఐ లక్ష్మణ్ రావు స్పష్టం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇదీచదవండి: రక్షణరంగంలో తనదైన గుర్తింపు సాధించిన తెలుగు వనిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.