Road accident in Medchal: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలంలో స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన టాటా ఏస్ వాహనంలో వెళ్తున్న 13 మందిలో ముగ్గురు చనిపోయారు.
కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 9మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి.. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పెరగనున్న మెట్రో ఛార్జీలు