ROAD ACCIDENT IN KARIMNAGAR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరుకి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ధర్మారం చర్చికి ఆటోలో నలుగురు మహిళలు వెళ్తున్నారు. ధర్మపురి నుంచి వస్తున్న ఆటో గుంతను తప్పించే క్రమంలో కరీంనగర్ నుంచి వస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తల్లి, కుమార్తెతో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్‌రావుపేట వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను హుటాహుటినా కరీంనగర్ కేంద్ర ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులు ధర్మపురికి చెందిన సుధా, ఆమె కూతురు ప్రిన్సిత, ఆటో డ్రైవర్ కుమార్తె మిల్కా రాణిగా గుర్తించారు. రహదారిపై గుంతలు ఉండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: