ETV Bharat / crime

దంపతుల పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. భార్య పరిస్థితి విషమం - హైదరాబాద్​ రోడ్డు ప్రమాద వార్తలు

హైదరాబాద్​లోని హిమయత్ నగర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతోన్న దంపతులు అదుపుతప్పి కింద పడిపోగా.. ఆర్టీసీ బస్సు వారి పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యకు తీవ్రగాయలయ్యాయి. గమనించిన ట్రాఫిక్​ పోలీసులు బాధితురాలిని హైదర్​గూడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

road accident in hyderguda Ones situation is poisonous
దంపతుల పైనుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. భార్య పరిస్థితి విషమం
author img

By

Published : Feb 24, 2021, 3:52 PM IST

ద్విచక్రవాహనం అదుపు తప్పి దంపతులు కింద పడిపోగా.. వారిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిన ఘటన హైదరాబాద్​లోని హిమాయత్​ నగర్ కూడలి వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో భర్తకు స్వల్పగాయాలవ్వగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.

ద్విచక్రవాహనంపై దంపతులిద్దరు ప్రయాణిస్తుండగా హిమాయత్​ నగర్​ కూడలి వద్ద రోడ్డుపై గుంతలు ఉండడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. వారి వెనుకే వస్తున్న ఉప్పల్ డిపోకు చెందిన బస్సు మహిళ కాళ్ల పైనుంచి వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన ట్రాఫిక్ పోలీసులు వారిని హైదర్​గూడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.