నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టింది. బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కాలిపై నుంచి కంటైనర్ టైర్లు వెళ్లటంతో కాలు నుజ్జునుజ్జయింది. వెంటనే స్పందించిన జాతీయ ఆరోగ్య బీమా అథారిటీ (ఎన్ఎచ్ఏఐ) సిబ్బంది... బాధితున్ని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించిన కంటైనర్ డ్రైవర్... వాహనాన్ని పూర్తిగా ఎడమ వైపుకు తిప్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: అదృశ్యం కేసులో శవానికి పంచనామా