నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్‌రెడ్డి విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మహాదేవునిపల్లె గ్రామానికి చెందిన శివాజీ అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య సంతోషిని కామారెడ్డిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా.. ఎస్సై శివప్రసాద్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని బంధువులు ఆరోపించారు. శివాజీ మృతికి ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి కారణమంటూ గ్రామస్థులు, వారి బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివప్రసాద్ రెడ్డి , సంతోషినిపై గాంధారి పోలీస్‌స్టేషన్‌లో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ప్రాథమిక నివేదిక ప్రకారం ఎస్సైని సస్పెండ్ చేశారు. మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసే అవకాశముందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: Mother arrest: కుమారున్ని కొట్టి చంపిన కేసులో తల్లి అరెస్ట్