ETV Bharat / crime

పని ఉందంటూ తీసుకెళ్లి.. అడ్డా కూలీపై హత్యాచారం - rape on a woman labour at shamshabad

ఓ మహిళా కూలీపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పని ఉందంటూ అడ్డా నుంచి మహిళను తీసుకెళ్లిన కామాంధులు.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం రాయితో తలపై మోది అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన శంషాబాద్​ మండల పరిధిలో చోటుచేసుకుంది.

పని ఉందంటూ తీసుకెళ్లి.. అడ్డా కూలీపై హత్యాచారం

author img

By

Published : Jun 9, 2022, 7:23 AM IST

అడ్డా నుంచి మహిళా కూలీని తీసుకెళ్లిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు అంతమొందించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. ఈ దారుణం శంషాబాద్‌ మండల పరిధిలో బుధవారం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ(40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్‌లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను పిలిచారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని బాధితురాలు తన రెక్కల కష్టంతో పోషిస్తోంది. చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహం చేసింది. కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు.

ఇవీ చూడండి..

మైనర్‌ బాలికపై అత్యాచారం.. ఇంట్లో అద్దెకుండే వాడి పనే!

పరువు హత్య.. దళిత యువకుడ్ని ప్రేమించిందని కూతుర్ని చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.