ETV Bharat / crime

మైనర్​ బాలికకు వేధింపులు.. పురుగుల మందు తాగించి హత్య

రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధులకు వరకు రక్షణ లేకుండా పోయింది. ఓ మైనర్​ బాలికపై అత్యాచారం చేసి.. ఆపై పురుగుల మందు తాగించాడు. యువతి ప్రాధేయపడగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆలస్యం కావటంతో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది.

బాలికపై అత్యాచారం.. ఆపై పురుగుల మందు తాగించి...

author img

By

Published : Feb 3, 2021, 12:42 PM IST

Updated : Feb 3, 2021, 5:52 PM IST

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మైనర్​ బాలికకు మాయమాటలు చెప్పి.. పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అర్థరాత్రి పిలిచి ఊరు చివర నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాలికకు పురుగుల మందు తాగించి.. తానూ పురుగుల మందు తాగాడు. అనంతరం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి వచ్చి పురుగుల మందు తాగమని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మైనర్ బాలిక మృతి చెందింది. యువకుడిని పోలీసులు చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని ఆసుపత్రికి తరలించారు.

అభం, శుభం తెలియని తన చిన్నారిని పొట్టనపెట్టుకున్నాడని.. రాజుని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లితండ్రులు డిమాండ్ చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఓటీపీతో రేషన్.. సామాన్యులకు తప్పని పరేషాన్...

Last Updated : Feb 3, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.