రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య కరోనా కాటుకు బలయ్యారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంజయ్య మృతిపట్ల పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
జిల్లాకు ఉత్తమ సేవలందించిన అంజయ్య మరణించారనే వార్త జిల్లా ప్రజలను కలచివేసింది. అంకిత భావంతో జిల్లాకు సేవలందించి అందరి మన్ననలు, ప్రేమాభిమానాలు పొందిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.