ETV Bharat / crime

ఉపాధ్యాయుడిని దొంగగా మార్చిన జల్సాలు..!

జల్సాలకు అలవాటు పడిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు చోరీల బాట పట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. అయినా ఊరుకున్నాడా అంటే అక్కడ పేరు మోసిన మరో ఇద్దరు దొంగలతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. బెయిల్​పై బయటకి వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడగా రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

Rachakonda police arrested a teacher  turned out to be a thief
ఉపాధ్యాయుడిని దొంగగా మార్చిన జల్సాలు..!
author img

By

Published : Mar 9, 2021, 5:19 PM IST

దొంగతనాలకు అలవాటుపడిన కోసూరి శ్రీనివాస్​రావు అనే ప్రైవేటు ఉపాధ్యాయున్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో జైలుకెళ్లినప్పుడు పరిచయమైన పదిమంది నిందితులను బెయిల్​పై బయటకు తీసుకొచ్చేందుకు ఓ న్యాయవాదిని నియమించుకున్నాడు. అతనికి ఫీజు చెల్లించేందుకు దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 52 తులాల బంగారం, అర కేజీ వెండి ఆభరణాలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని మల్కాజ్​గిరి డీసీపీ రక్షితమూర్తి పేర్కొన్నారు. రామారావుపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 దొంగతనం కేసులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన కోసూరి శ్రీనివాస్​రావు బీకాం వరకు చదివాడు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న సమయంలో జల్సాలకు అలవాటు పడ్డారు. అతని ప్రవర్తన సరిగా లేకపోవటంతో భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ నేరేడ్​మెట్​కు మకాం మార్చాడు. రాత్రివేళ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి... జైలుకు పంపారు.

పీడీ చట్టం కేసులో అరెస్టయిన గణేశ్, రామారావుతో శ్రీనివాస్​రావుకు జైల్లో పరిచయం ఏర్పడింది. వారితో పాటు మరో పది మంది పాత నేరస్థులతో కలిసి జైల్లోనే ముఠాగా ఏర్పడ్డారు. రామారావు, శ్రీనివాస్​రావు బెయిల్​పై బయటకి వచ్చారు. గణేశ్​తో పాటు మిగితా నిందితులను బెయిల్​పై బయటకు తీసుకు వచ్చేందుకు గణేశ్​ భార్య సరితతో కలిసి న్యాయవాదిని నియమించుకున్నారు. అతనికి ఫీజు చెల్లించేందుకు దొంగతనాలకు పాల్పడుతుండగా శ్రీనివాస్​రావుతో పాటుగా సరితను అరెస్ట్ చేశామని మల్కాజ్​గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.

ఇదీ చదవండి: హైటెన్షన్ కేబుల్​ పోల్​ను ఢీకొట్టిన టిప్పర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.