ETV Bharat / crime

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన - ఇబ్రహీంపట్నం లిమ్రా ఆస్పత్రి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట.. మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే తమ బంధువు మరణించాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

medical negligence
వైద్యుల నిర్లక్ష్యం
author img

By

Published : Apr 12, 2021, 3:24 PM IST

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించాడంటూ.. ఓ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రి వద్ద జరిగిందీ ఘటన. లోయపల్లి గ్రామానికి చెందిన కృష్ణ గౌడ్​(42).. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరాడు. రోగి పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యులు.. హైదరాబాద్​లోని మరో ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

కృష్ణను.. నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఆగ్రహించిన బంధువులు.. చికిత్స చేయడంలో వైద్యులు ఆలస్యం చేశారంటూ మండిపడ్డారు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: పేకాట స్థావరంపై దాడి.. 34 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.