ETV Bharat / crime

Saidabad incident: సైదాబాద్​ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతం.. గాలింపు ముమ్మరం

ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా వెతకని చోటు లేదు. జన సమర్థ ప్రాంతాల్లో పోస్టర్లు వేసినా.. రూ.10 లక్షల రివార్డు ప్రకటించినా ఇప్పటి దాకా ఫలితం లేదు. ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది పోలీసులు గాలిస్తున్నా అతడి జాడ లేదు. ఇది ఏ గజదొంగనో.. ఉగ్రవాదినో పట్టుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు కాదు. సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు కోసం పోలీసులు శ్రమిస్తున్న తీరు.

Saidabad incident: సైదాబాద్​ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతం.. గాలింపు ముమ్మరం
Saidabad incident: సైదాబాద్​ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతం.. గాలింపు ముమ్మరం
author img

By

Published : Sep 16, 2021, 5:01 AM IST

సైదాబాద్​ హత్యాచార ఘటన నిందితుడు రాజు ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. ఆటోలు, రైళ్లు, బస్సులు ఇలా ప్రతి చోట.. 24 గంటల పాటు మూడు కమిషనరేట్ల పరిధిలోని వెయ్యి మందికిపైగా పోలీసులు గాలిస్తున్నారు. అయినా... ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు. ఈ నెల 9న సింగరేణి కాలనీలో చిన్నారిని చిదిమేసిన రాజు...6 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగి నేరుగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఎల్​బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో నిందితుడు సంచరిస్తున్నాడనే ఉద్దేశంతో.. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్​ను అప్రమత్తం చేశారు. సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ప్రధాన రహదారులు, వీధులతో పాటు కాలనీల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ప్రతి పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎస్సై ఆధ్వర్యంలో ఒక బృందం ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల సైతం కూడళ్ల వద్ద నిఘా పెట్టారు. రైళ్లు, బస్సులు, ఆటోలపై పోస్టర్లు అంటించారు. జన సమర్థ ప్రాంతాల్లో ప్రజలకు రాజు చేసిన నేరం గురించి వివరిస్తూ ఆచూకీ చెప్పాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం సహా పోలీసులపై విమర్శలు వస్తుండటంతో.. నిందితుడుని త్వరగా పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ విచారం..

హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్​ విచారం వ్యక్తం చేసినట్లు హోంమంత్రి మహమూద్అలీ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సహా పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని.. డీజీపీ మహేందర్ రెడ్డి హోంమంత్రికి వివరించగా... రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయాలని మహమూద్ అలీ ఆదేశించారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని సూచించారు. వరంగల్​లో జరిగిన చిన్నారి హత్యాచార ఘటనలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టు మరణశిక్ష విధించిందని.. సైదాబాద్ ఘటనలోనూ చట్టపరంగా కఠిన శిక్షపడేలా చూడాలని ఆదేశించారు.

గతంలోనూ కేసు..

నిందితుడు రాజుపై గతంలోనూ చైతన్యపురి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆటోను దొంగిలించిన కేసులో గతేడాది అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం బెయిల్​పై బయటకు వచ్చాడు. రాజుకు తండ్రి లేకపోవడంతో, తల్లి కూలీ పనులు చేస్తూ కొడుకును పోషించింది. కేవలం 3వ తరగతి వరకే చదివిన రాజు ఎక్కువగా హైదరాబాద్​లోనే ఉంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అప్పుడప్పుడు సొంత గ్రామమైన జనగామ జిల్లా కడకొండ్లకు వెళ్లొస్తుంటాడని చుట్టుపక్కల వారు పోలీసులకు వివరించారు. లేబర్ అడ్డాల్లోనూ రాజు ఒకరిద్దరితోనే మాట్లాడతాడని... వాళ్లతో కలిసి కూలీ పనిచేయగా వచ్చే సొమ్మును పంచుకుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.