నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామానికి సమీపంలో జరుగుతున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. క్యాంపు రాయవరం గ్రామానికి వెలుపల వ్యవసాయ పొలాల్లో కొంతమంది వ్యక్తులు కోడి పందేలు నిర్వహిస్తున్నారు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పందేల స్థావరంపై దాడి చేసి చేసి 14 మందిని అరెస్టు చేశారు. రూ.45వేల నగదు, చరవాణులు, 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. చట్ట నిషిద్ధమైన ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ హెచ్చరించారు.