రంగారెడ్ది జిల్లా హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కళానగర్లో అనుమతి లేకుండా విత్తనాలు తయారు చేస్తున్న కేంద్రంపై రాచకొండ ఎస్వోటీ పోలీసుల దాడులు నిర్వహించారు. సుమారు రూ.6 లక్షల విలువైన 170 డబ్బాల మిర్చి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
బిబో సిడ్స్ పేరుతో మునగనూర్లో ఉండగా దానిని పసుమములలోని కళానగర్కు మార్చారు. అయితే అనుమతుల కొరకు దీనికి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికి... ఇంకా అనుమతులు రాలేదు. విత్తన కేంద్ర యజమాని గోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: చిన్నారి ప్రాణానికి ప్రపంచమే తోడు.. క్రౌడ్ఫండింగ్తో 16 కోట్లు సేకరణ