Police Attack On Tanker Driver: ఏపీలోని విజయవాడలో వైసీపీ నిర్వహిస్తున్న జయహో సభ ట్రాఫిక్ మళ్లింపులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలలో భాగంగా ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్‌కు చేతికి, నుదిటి భాగాలలో గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్‌పై.. విజయవాడ హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారు.
రోడ్డు పక్కనున్న ట్యాంకర్‌ను పోలీసులు తొలగించమని తెలపగా.. వాహనం సమస్య ఉందని తెలిపినా పోలీసులు వినకుండా దాడి చేశారని డ్రైవర్ సోదరుడు ఆరోపించాడు.
ఇవీ చదవండి: