కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌కు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 28న గుర్తు తెలియని ఆగంతుకుడు ఫోన్ చేసి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే తన కుమారుడు జాఫర్‌ను కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారని ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బెదిరింపు కాల్ చేసిన.. వ్యక్తి 21 సంవత్సరాల వయస్సున్న బిలాల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కుమారుడు జాఫర్‌తో రోడ్డు మీద గొడవ పడినందున.. కక్షతోనే బెదిరింపు కాల్ చేశాడని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. నిందితుడు బిలాల్ గతంలో హుమాయున్ నగర్‌లోని.. ఓ హోటల్లో దొంగలించిన ఫోన్‌తోనే కాల్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఎంపీ కోమటిరెడ్డిపై నాలుగు కేసులు కొట్టివేత