ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ సమీపంలోని జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బోథ్ మండలం సోన్ గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. నేరడిగొండ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్ మీదకు ఎక్కింది.
ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారందర్నీ మరో బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. పెనుప్రమాదం తప్పడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.