మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణం సమీపంలో బోయపల్లికి వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశివును వదిలేశారు. ముళ్ల పొదల నుంచి పసికందు ఏడుపు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
అక్కడి చేరుకున్న అధికారులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టడంతో ఆ కసాయి తల్లిదండ్రులు శిశువును వదిలి వెళ్లినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. చికిత్స అనంతరం చిన్నారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంరక్షించనున్నారు.
ఇదీ చదవండి: వివాహిత మృతి.. బంధువుల ఫిర్యాదు