ఆదిలాబాద్ పట్టణంలో అనిశా అధికారుల ఆకస్మిక తనిఖీ సంచలనం సృష్టించింది. సీసీ రహదారుల బిల్లు కోసం ఆదిలాబాద్ గ్రామీణ మండలం పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఏం చేయాలో పాలుపోని సదరు గుత్తేదారు.. అనిశా అధికారులను ఆశ్రయించారు.
అధికారులు చెప్పినట్లుగా సదరు గుత్తేదారు.. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ.. ఏఈకి రెండు లక్షల రూపాయలు ఇస్తుండగా.. అనిశా అధికారులు చంద్రశేఖర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డుపై అతణ్ని అరెస్టు చేశారు.