ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి బ్యారేజీ నిర్మాణ సిబ్బంది నివాసం ఉండే క్యాంపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒకరు సజీవదహనం కాగా.. మూడు టిప్పర్ వాహనాలు, మరో ట్రాక్టర్ కాలిపోయింది. వంట చేసుకునే సమయంలో చిన్న గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
నిల్వ చేసుకున్న డీజిల్ ద్వారా భారీగా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్న 50 మంది సిబ్బంది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని కట్టు బట్టలతో పరుగులు పెట్టారు. ఈ ఘటన తాంసీకే గ్రామానికి సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా.. దూరభారంతో ఆలస్యంగా వచ్చారు. అప్పటికే మంటలు వ్యాపించి సిబ్బంది తాత్కాలిక నివాసాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని ఇంకా గుర్తించాల్సి ఉంది.
ఇదీ చూడండి : రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం