భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరులో లారీ ఒకేసారి మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇంకొక ద్విచక్ర వాహనదారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మొరంపల్లి బంజార పీహెచ్సీకి తరలించారు.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. సుమారు 15 లక్షల నష్టం