ETV Bharat / crime

మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ జేమ్స్ అరెస్ట్‌

నైజీరియాకు చెందిన జేమ్స్ అనే మాదకద్రవ్యాల సరఫరాదారుడిని హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నివాసంలో సోదాలు చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులు గోవా, బెంగళూరుల్లో మకాం వేసి దందా నడిపిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ జేమ్స్ అరెస్ట్‌
మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ జేమ్స్ అరెస్ట్‌
author img

By

Published : Mar 25, 2021, 5:13 AM IST

మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ జేమ్స్ అరెస్ట్‌

హైదరాబాద్‌లో మత్తు పదార్థాల వాడకం మరోసారి కలకలం రేపింది. డ్రగ్స్‌ సరఫరా, వాడకంపై గట్టి నిఘా ఉండటం వల్ల ఇతర ప్రాంతాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. తాజాగా నైజీరియాకు చెందిన జేమ్స్‌ అనే వ్యక్తిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. అతను ఉంటున్న ఇంటిపై దాడులు నిర్వహించి.. 153 గ్రాముల కొకైన్‌, 16 గ్రాముల ఎండీఎంఏ మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు పది లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జేమ్స్‌తో పాటు మరో ఇద్దరిని గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. డిసెంబర్ నెలలో జేమ్స్ బెయిల్​పై విడుదల అయ్యాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరాలో ఆరితేరిన డాడిబాయ్ అలియాస్‌ జాన్‌, మైక్‌లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. అంతకుముందు వారిద్దరూ హైదరాబాద్‌లో ఉంటూ డ్రగ్స్‌ సరఫరా చేసేవారు. ఇక్కడ నిఘా పెరగడం వల్ల గోవా, బెంగళూరుకు మకాం మార్చారు. అక్కడే ఉంటూ హైదరాబాద్‌లోని వాడకందార్లకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. వారిద్దరికి ప్రతినిధిగా జేమ్స్‌ హైదరాబాద్‌లో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కదలికలపై ఆరా

బెయిల్‌పై విడుదలై ముంబయి వెళ్లిన జేమ్స్‌ కదలికలపై ఆరా తీసిన అధికారులు... కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఖైరతాబాద్‌ ఎంఎస్​ మక్తాలో ఉంటూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు అనుమానించి... ఉన్నపళంగా అతడి ఇంటిపై దాడి చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌ నంబర్లు, వాట్సాప్‌ మెసేజ్‌ల ఆధారంగా ముఠా గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. గోవా, బెంగళూరు నుంచి పంపించిన డ్రగ్స్‌ను నగరంలో వాడకందార్లకు సరఫరా చేస్తున్నట్లు జేమ్స్‌ అధికారుల విచారణలో వెల్లడించాడు.

వారాంతాల్లో అమ్మకాలు

వారాంతాల్లో 20 గ్రాముల వరకు డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క గ్రాముపై 2 వేల రూపాయల వరకు జేమ్స్‌ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. జేమ్స్‌ వద్ద మరింత సమాచారం లేకపోవడం వల్ల ప్రత్యేక బృందాలను గోవా, బెంగళూరుకు పంపి... సూత్రధారుల కోసం వెతికే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి: కరోనా దృష్ట్యా ఇంటర్ కళాశాలలు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.