ETV Bharat / crime

NIA chargesheet on dummugudem case : నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఏడుగురు మావోయిస్టులపై ఛార్జ్‌షీట్‌ - తెలంగాణ నేరవార్తలు

NIA
NIA
author img

By

Published : Nov 12, 2021, 6:10 PM IST

Updated : Nov 12, 2021, 6:53 PM IST

18:07 November 12

నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఏడుగురు మావోయిస్టులపై ఛార్జ్‌షీట్‌

దుమ్ముగూడెం కేసులో (NIA filed Charge sheet dummugudem case) ఏడుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.  మావోయిస్టు నేతలు హిడ్మా, సాంబయ్య, మడకం కాశీలను నిందితులుగా పేర్కొంది. ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులపై దాడులు చేసేందుకు మావోయిస్టు నేతలు కుట్రపన్నారని.. దీనికోసం మావోయిస్టు సానుభూతిపరుల సాయంతో పలుసార్లు పేలుడు పదార్థాలను (NIA filed Charge sheet dummugudem case) కొనుగోలు చేశారని ఛార్జ్‌షీట్‌లో ఎన్​ఐఏ పేర్కొంది.  

పేలుడు పదార్థాల కోసం మావోయిస్టు నేత హిడ్మా.. పెద్దమొత్తంలో డబ్బులను సానుభూతిపరులకు చెల్లించారని ఎన్ఐఏ ఛార్జ్​షీట్​లో పేర్కొంది. మావోయిస్టు సానుభూతిపరులు (NIA Charge sheet against seven Maoists) ఫిబ్రవరిలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి పలు వాహనాల్లో అటవీ మార్గంలో హిడ్మాకు, ఇతర మావోయిస్టు నేతలకు చేరవేసేందుకు ప్రయత్నించారని.. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న దుమ్ముగూడంలో పోలీసులకు పట్టుబడ్డారని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.  

18న దుమ్ముగూడెం పోలీసులు కేసు నమోదు చేయగా... మే 2న జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని నాంపల్లి కోర్టుకు సమర్పించిన నేరాభియోగపత్రం (ఛార్జ్‌షీట్‌)లో (NIA chargesheet on dummugudem case) జాతీయ దర్యాప్తు సంస్థ వివరించింది. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న నలుగురు మావోయిస్టులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. మరో ముగ్గురు మావోయిస్టులు పరారీలో ఉన్నారు.  

ఇదీచూడండి: ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్

Last Updated : Nov 12, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.